మన్యం మనుగడ మంగపేట.
నేడు సోమవారం స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో చర్ల మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద ఉదయం 10 గంటలకు మిర్చి పంటలో నాణ్యతా ప్రమాణాల పెంపు పై రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పైసెస్ బోర్డు అధికారులు పత్రికా ప్రకటనలో తెలిపారు ఈ రైతు శిక్షణ కార్యక్రమానికి జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి స్పైసెస్ బోర్డు వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గాధి లింగప్ప కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శ్రీమతి డాక్టర్ లక్ష్మీనారాయణమ్మ జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ అధికారి మరియన్న వ్యవసాయ అధికారి శివరాం ప్రసాద్ స్థానిక ప్రజా ప్రతినిధులు రైతులు హాజరవుతున్నట్లు వారు తెలిపారు మిర్చి పంట సాగు చేసిన రైతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైతు శిక్షణ కార్యక్రమం లో పాల్గొనాలని స్పైసెస్ బోర్డు క్షేత్ర అధికారి శరణప్ప ఆదర్శ రైతు మేడిచర్ల సత్యనారాయణ కోరారు.
Post A Comment: