గుండాల /ఆళ్ల పల్లి ఫిబ్రవరి 15 (మన్యం మనుగడ) మండల కేంద్రంలో 26 లక్షల రూపాయలతో ప్రాథమిక వైద్య శాల లో పనిచేస్తున్న వైద్యాధికారుల కోసం నిర్మించిన నూతన గృహ సముదాయాలను ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం ప్రారంభించారు. వైద్యులు స్థానికంగా ఉండి వైద్యం అందించాలంటే వారికి లేనందున ఇబ్బంది పడుతున్నారనీ వారు స్థానికంగా ఉండాలని అన్ని వసతులతో ఈ నూతన గృహాలను నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, ఎంపీడీవో మంగమ్మ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు, అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
Post A Comment: