మన్యం మనుగడ,ములకలపల్లి:1/7౦ చట్టానికి విరుద్ధంగా మండలం లో నిర్మిస్తున్న అక్రమకట్టడాలపై చర్యలు తీసుకోవాలి ఆదివాసీ విద్యార్థి సేన మండల నాయకులు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని పాతగాంగరం గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా గిరిజనేతరులు ఏజన్సీ చట్టాలకు విరుద్దంగా అక్రమ కట్టడాలు,షాప్,లు నిర్మిస్తున్నారు వెంటనే అక్రమకట్టడాలు చేపడుతున్న గిరిజనేతరులపై చర్యలు తీసుకోవాలి అని ,అలాగే వాటిని కూల్చి వేయాలని పాత గంగారాం పంచాయితీ సెక్రటరీ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సేన ములకలపల్లి మండల కో కన్వీనర్ ఎడమ రమేష్, నాయకులు ఇర్ప ప్రసాద్ ,మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: