మన్యం టీవీ భుర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు మరియు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు,తెలంగాణ రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం బోధన మరియు పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన మరియు పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7289 కోట్లతో *మన ఊరు మన బడి* ప్రణాళికతో ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని,ముఖ్యమంత్రి తెలంగాణ రథసారథి కెసిఆర్ తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తూ,పాఠశాలల పున ప్రారంభం నేపద్యంలో, ఆనందోత్సవాల మధ్య విద్యార్థులతో కలిసి బెలూన్స్ ను ఎగరవేసి,విద్యార్థులకు చాక్లెట్లు,బిస్కెట్లు పంచి ఉపాధ్యాయులకు మరియు పిల్లల తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఈ పథకం యొక్క ఉద్దేశం వివరించడం జరిగింది.ఈ సందర్భంగా జడ్పీటీసీ శ్రీలత మాట్లాడుతూ, మారుతున్న ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఇంగ్లీష్ మీడియం ద్వారానే ఈ పేద బడుగు బలహీన వర్గాలు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు అనే ఉద్దేశంతో ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి. రమణారెడ్డి,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు ఎల్లంకి లలిత, ఉపాధ్యక్షులు వారాల వేణు, సారపాక టౌన్ అధ్యక్షులు కొనకంచి శ్రీను,సారపాక టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలి శ్రీహరి, ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు,ఉపాధ్యక్షుడు చట్టు ఆంజనేయులు,ఏ ఎం సి డైరెక్టర్ బానోతు శ్రీను,టౌన్ యువజన అధ్యక్షులు సోము లక్ష్మీ చైతన్య రెడ్డి,మైనారిటీ నాయకులు గుల్ మహమ్మద్, కనకాచారి,కౌలూరు వీరయ్య, కృష్ణ మరియు కార్యకర్తల తో పాటు జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయని ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Post A Comment: