CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కన్నుల పండుగగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం.

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం :

   మండల కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో కన్నులపండుగగా రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఆలయ ధర్మ కర్తలు తిప్పని కృష్ణారావు, లలిత, తిప్పని శ్రీనివాసరావు శ్రీలతల ఆధ్వర్యంలో జరిగింది. ఆదివారం రాత్రి అమ్మవారి ఆలయంలో మైలలు తీయడంతో మొదలైన పండుగ సోమవారం దేవర బాల శ్రీలత బొడ్రాయి, ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జోగు అడిగించారు. అనంతరం పుట్టకమ్మి రాత్రి 9 గంటలకు పుట్డ బంగారం ఆలయానికి చేర్పించారు. మంగళవారం ఆలయం వద్ద పట్నాలు ఎల్లమ్మ కథను భక్తులకు జనగం జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమడురు గ్రామానికి నుంచి వచ్చిన జిట్టె వీరస్వామి, చిర్ర సైదులు, చిర్ర నర్సయ్య, తుప్పతి యాదయ్య, అశోక్ ఉగ్గు కళాకారులు భక్తుల వివరించారు. అనంతరం భక్తులకు ఆలయ ధర్మకర్తలు అన్నదానం ఏర్పాటు చేశారు. ఎల్లమ్మ కళ్యాణంతో కరకగూడెం మర్మోగింది.

Share it:

TS

Post A Comment: