దమ్మపేట జెడ్పీటీసీ పైడి వేంకటేశ్వరరావు మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 02 ) బుధవారం ;- అశ్వారావుపేట పట్టణంలో ఈరోజు ఏసిపి రోహిత్ రాజును దమ్మపేట జెడ్పీటీసీ పైడి వేంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నీతికి నిజాయితీకి ఎసిపి రోహిత్ రాజు మారుపేరు అని ఇటువంటి అధికారులు మన దగ్గర పని చేయడం హర్షించదగ్గ విషయం అని రోహిత్ రాజు సేవలు వెలకట్టలేనివి అని యువత రోహిత్ రాజును ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణతో ఉన్నత చదువులు అధిరోహించి లక్ష్యాన్ని చేరుకోవాలని మంచి శిఖరాలను అందుకోవాలని చెడు వ్యసనాలకు బానిస కాకుండా దూరంగా ఉండాలని యువత సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోయం ప్రసాద్ వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు యార్లగడ్డ బాబు మండల ఎంపీటీసీలు మండల సర్పంచ్లు మొదలగు వారు పాల్గొన్నారు
Post A Comment: