CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతు వేదికలు ప్రభుత్వ కార్యక్రమాలకా లేక టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకా..? - సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి బొర్రా కేశవరావు.

Share it:

  



చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి:


రైతుల శ్రేయస్సు కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం, అలాగే పంచాయతీరాజ్ శాఖ ద్వారా లక్షల రూపాయలు వెచ్చించి రైతుల కోసం నిర్మించిన రైతు వేదికలు టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు అడ్డాలుగా మారాయని సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి బొర్రా కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం చండ్రుగొండ ప్రభుత్వ రైతు వేదిక లో టిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకుని ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు చేయడం ఏంటాని ఆయన ప్రశ్నించారు. దీనిని చూస్తుంటే రాజుల సొమ్ము రాళ్ళ పాలు అన్న చందంగా ఉందని అన్నారు. పేరుకే రైతు వేదికలని అది అధికార టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు అడ్డాలు అని అన్నారు. కెసిఆర్ కు మూడు రోజులుగా పుట్టిన రోజు వేడుకలు ఎందుకు నిర్వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రైతుల చేతులకు బేడీలు వేసి నందుకా... పోడు భూము సాగు దారులపై అక్రమ కేసులు పెట్టి నందుకా.. ప్రజాసమస్యలు లేవనెత్తిన వారిపై అక్రమ కేసులు పెట్టి నందుకా.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనందుకా... దీనికి స్థానిక ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని అన్నారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నేటి వరకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని. రైతులందరికీ రుణ మాఫీ చేస్తామని చెప్పి నేటికి అమలు చేయలేదన్నారు. పోడు భూముల సాగుదారులందరికీ పోడు పట్టాలు ఇస్తామని మాయమాటలు చెప్పి ఇవ్వకుండా మోసం చేసి ఫారెస్ట్ అధికారులతో భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఒక నిరుపేద కూడా డబల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదని. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిరుద్యోగులను సైతం మోసం చేశారని. ఇలా రైతులను, నిరుద్యోగులను, యువతను, నిరుపేదలను, మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు పుట్టినరోజు వేడుకలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Share it:

TS

Post A Comment: