- -మండలంలో జనాభా 6191, కుటుంబాలు 2056
- -దళిత బంధు యూనిట్లు 20
- -దళితుల మధ్య విభేదాలు
- -తలలు పట్టుకుంటున్న నాయకులు
మన్యంటీవి, అశ్వారావుపేట:దళిత బంధు పథకం గ్రామాల్లో దళితుల మధ్య విభేదాలు తెప్పిస్తుంది. మండలానికి యూనిట్లు 20 మాత్రమే కేటాయించడం, జనాభా సుమారు 7 వేల లోపు, రెండు వేలపై చిలుకు కుటుంబాలు ఉండటంతో యూనిట్ల ఎంపిక నాయకులకు తలలు పట్టుకునేలా చేస్తుంది. ఈ పథకం పర్యవేక్షణ మొత్తం ఆయా ఎమ్మెల్యేల పర్యవేక్షణలో జరగడం పార్టీలో గ్రూపులు, మధ్య ఆధిపత్యపోరుకు దారితీసేలా కనిపిస్తుంది. మండలంలో 30 పంచాయతీలకు గాను అల్లిగూడెం, గాండ్లగూడెం, కోయం రంగాపురం, జమ్మిగూడెం, మొద్దులమడ, పాతరెడ్డిగూడెం, వేదాంతపురం, కేసప్పగూడెం మినహా 22 పంచాయతీల్లో దళితులు జనాభా ఉన్నారు. ఇందులో పేరాయిగూడెం 903, అశ్వారా వుపేట 405, నారాయణపురం 255, వినాయకపురం 132, అచ్యుతాపురం 78, కొత్తమామిళ్ళవారిగూడెం 70, గుర్రాలచెరువు 57, ఆసుపాక 33, నారంవారిగూడెం 28, నారంవారిగూడెం కాలనీ 25, ఊట్లపల్లి 18, గుమ్మడవల్లి 17, తిరుమలకుంట 11, బచ్చువారిగూడెం 06, మద్దికొండ, దిబ్బగూడెం 04, అనంతారం 03, రామన్నగూడెం, కన్నాయిగూడెం 02, నందిపాడు, కావడిగుండ్ల, మల్లాయిగూడెం 01 కుటుంబాలు ఉన్నాయి. ఈ 20 యూనిట్లు పంచాయతీకి ఒక్కటి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం రాజకీయంగా ఎదిగిన అన్ని మండల స్థాయి పార్టీల దళితులు నాయకులు తెరాస నాయకులపై ఏదో రకమైన పైరవీలకు తెరదించారు. తెలుగుదేశం పార్టీలో ఉండి విజయం సాధించిన ఎమ్మెల్యె తెరాసలో చేరడంతో ఆయనపై ఇరు పార్టీల దళిత నాయకులు ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. తెరాసలోనే ఉండటంతో ప్రజాప్రతినిధులు వారీ గ్రూపులు ఆధిపత్యపోరుకు దారితీసే అవకాశం ఉంది.
Post A Comment: