- జిల్లా నేతకాని సంఘం అధ్యక్షులు దుర్గం ప్రేమ్ కుమార్,జిమ్మిడి ప్రకాష్
మన్యం మనుగడ, కరకగూడెం : మండలంలోని నేతకాని కులస్తులు అన్ని రంగాల్లో ముందుండాలని, నేతకాని ఐక్యతకు చాటుకోవాలని భద్రాద్రి జిల్లా నేతకాని సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు దుర్గం ప్రేమ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు జిమ్మిడి ప్రకాష్, మాజీ ఎంపీటీసీ దుర్గం సంజీవ,
అన్నారు. మండల కేంద్రంలో నేతకాని సంఘం ముఖ్యనాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతకాని కుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేతకాని కులస్థులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని.సంఘం విద్య, వైద్యం, ఉద్యోగం, క్రీడా, రాజకీయ రంగాల్లో పేరు తీసుక రావాలని అన్నారు. నేతకాని కులస్థులం ఐక్యతగా ముందుకు సాగలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 28 వ తేదీన రాళ్ళవాగు పెద్దమ్మ ఆలయం వద్ద నేతకాని కుల మండల నూతన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జాడి నాగరాజు, రామటేంకి మోహన్ రావు, దుర్గం ముసలయ్య,రామటేంకి నరసయ్య, నాగభూషణం, రామటేంకి అశోక్, హరీష్, దుర్గం ప్రసాద్, జాడి దినేష్, గాందర్ల సతీష్ కుమార్, ధనంజయ్,గోగు సాయి,జనగాం సుమన్,జాడి అర్జున్,జాడి వంశీ, రామటేంకి వంశీ, వంసత్, రితీష్, జగదీష్,జాడి విజయ్, జాడి సంగీత్,దుర్గం మహేష్, లోకేష్, దుర్గం శరత్, సందీప్ కిరణ్ సురేందర్,దుర్గం కౌశిక్, అఖిల్,ప్రియ, ప్రణయ్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: