మన్యం మనుగడ కరకగూడెం.
తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యాశాఖ లో ప్రభుత్వపాఠశాల ల్లో ఆంగ్ల మాద్యమo నిర్ణయం పై ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి ముఖ్య మంత్రి కెసిఆర్ కు తెలంగాణా ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్బంగా తాటిగూడెంలో పాఠశాలలు పునః ప్రారంభం అయిన సందర్బంగా విద్యార్థుల తో కలసి గులాబీ లు పంచి బెలూన్ లు ఎగురవేయడం జరిగింది. తదనంతరం గాంధీనగర్ లో నూతన అంగన్వాడీ ని రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో సర్పంచ్ కొమరం విశ్వనాధం,ఉపసర్పంచ్ జాడి నాగరాజు, తెరాస మండల్ ప్రెసిడెంట్ రావుల సోమయ్య, ఉపాధ్యక్షులు పోగు వెంకటేశ్వర్లు, సోషల్ మీడియా ఇంచార్జి గంధర్ల సతీష్ కుమార్, సెక్రటరీ వెంకోడత్ వీరన్న, పాఠశాల ప్రదానోపాధ్యాయులు, నూతన ఉపాధ్యాయరాలు జాడి అనూష,విద్యార్థి విభాగం జిల్లా ప్రెసిడెంట్ జిమ్మిడి ప్రకాష్, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: