మన్యం మనుగడ కరకగూడెం: మండలపరిధిలోని రేగళ్ళ గ్రామపంచాయతి లో గల మాదాన్నగూడెం వలస ఆదివాసి గ్రామానికి చెందిన ముచ్చకి. భీమయ్య( 8)సంవత్సరాలు అనే బాలుడు మృతి చెందాడు. కరకగూడెం ఎస్ ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి రేగళ్ళ పంచాయతీ పరిధిలో గల మాదన్న గూడెం ఆదివాసి గ్రామానికి చెందిన ముచ్చకి భీమయ్య ( 6) సంవత్సరాలు అనే బాలుడు తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలో గల కలనందా చెరుకు స్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని ఎస్ఐ తెలిపారు. సంఘటన స్థలానికి ఆర్ ఐ హుస్సేన్ ఎస్ ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో చేరుకొని వివరాలు సేకరిస్తు మృతుడి తండ్రి జోగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. మృతుడు గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉండవలసిన బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకు ఉన్నాయి.
Post A Comment: