టేకులపల్లి ఫిబ్రవరి 13 (మన్యం మనుగడ)కోయగూడెం ఓసి త్రీ గనులను సింగరేణి కే కేటాయించాలని టేకులపల్లి రాజకీయ .కార్మిక. ప్రజాసంఘాల జెఎసి డిమాండ్ చేసింది. ఈ సమావేశంకు ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షుడు డి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తుడుం దెబ్బ. తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఎమ్మార్పీఎస్ తెలంగాణ జన సమితి తదితర ప్రజా. కార్మిక సంఘాల నేతలు లక్కినేని సురేందర్ రావు. కల్తీ వెంకటేశ్వర్లు. డి ప్రసాద్ .సంజీవ రావు భూక్య దళ్ సింగ్ నాయక్. మాన్సింగ్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ కోయగూడెం ఓసి పనులను సింగరేణికే కేటాయించాలని లేనియెడల ప్రజా. కార్మిక ఉద్యమాన్ని బలోపేతం చేసి అడ్డుకుంటామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి హక్కులను విస్మరించి తన ఇష్టం వచ్చిన వారికి కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్రలకు పాల్పడుతున్నారని దీనిని ప్రజలు ప్రజాస్వామికవాదులు ముక్త కంఠంతో ఖండించాలి కోరారు. ఓసీ పనులను సింగరేణి కే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21 న టేకులపల్లి లో ప్రదర్శన నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ ప్రదర్శనలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రదర్శనలో ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ. భద్రాచలం ఎమ్మెల్యే పోదెంవీరయ్య . ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య .జడ్పీ చైర్పర్సన్ కోరం కనకయ్య తదితరులు పాల్గొంటారని వారు తెలియజేశారు. ఈ సమావేశంలో జర్పుల సుందర్ . గూగుల్ లోతు రామ్ చందర్. ప్రభాకర్. గుండా నరసింహారావు.. పూజారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: