మన్యం మనుగడ ములుగు
ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మండల పరిషత్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం జడ్పీ సీఈఓ ప్రసన్న రాణి అధ్యక్షతన ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ హాజరై ఎంపీడీవోల సంఘం క్యాలెండర్,డైరీలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ జగదీశ్ మాట్లాడుతూ. ములుగు జిల్లాలో ప్రతి మండలం లోని మండల పరిషత్ అధికారులు ప్రజలకు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని,ప్రజాసేవలో ఎంపీడీవోల సంఘం గొప్ప పేరు సంపాదించుకోవాలని అన్నారు.ప్రజాసేవ దేవుడు సేవగా ఉద్యోగులు భావించి పని చేయాలని అన్నారు. అనంతరం జడ్పీ చైర్మన్ ను అధికారులు శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ రమాదేవి,ములుగు మండల ఎంపిడిఓ లు శ్రీనివాస్,సత్య ఆంజనేయులు,శ్రీధర్, ఫణిచందర్,విజయ,బాబు తదితర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: