మన్యం మనుగడ మంగపేట.
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యా పెడరేషన్( టీఎస్యుటీఎఫ్ )ములు గు జిల్లా కమిటీ సమావేశం ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల బ్రాహ్మణ పల్లి లో జిల్లా అధ్యక్షులు గొప్ప సమ్మారావు అధ్యక్షతన జరిగినది .ఈ సమావేశం లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యా పెడరేషన్ ఆడిట్ కన్వినర్ ఆవారి శ్రీనివాస్ మాట్లాడుతూ గురుకులాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పిఆర్సీ అమలు చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండు చేసారు .317 జి ఓ వలన నష్ట పోయిన ఉపాధ్యాయులకు న్యాయంచేయాలన్నారు .అనంతరం బదిలీల వలన ములుగు జిల్లా శాఖ లో ఏర్పడిన ఖాళీలకు ఎన్నికలు నిర్వహించారు ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శిగా రెడ్డి వాసుదేవ రెడ్డి , ఉపాధ్యక్షులుగా జక్కుల వెంకటస్వామి ,ఆడిట్ కమిటీ కన్వినర్ గా ఎల్.దస్రు నాయక్ ను ఎన్నుకోవడం జరిగినది . ఈ సమావేశం లో జిల్లా కోశాధికారి పొడెం సమ్మయ్య , జిల్లా కార్యదర్శులు జి వి వి సత్యనారాయణ , రఘురాం ,లక్ష్మి నారాయణ ,భూమిరెడ్డి ,మంగపేట మండల అధ్యక్ష కార్యదర్శులు కాకా సమ్మయ్య మూలకాల వెంకట స్వామి మండల ఉపాధ్యక్షుడు గుండం పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు .
Post A Comment: