మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గా నియమితులైన ప్రభుత్వ విప్,పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫిబ్రవరి 05 వ తేదీన అధ్యక్ష హోదలో తొలిసారి కొత్తగూడెం రానున్న నేపధ్యంలో విప్ రేగా కాంతారావు కు ఘనస్వాగతం పలికేందుకు మణుగూరు సింగరేణి ఏరియా టిబిజికేయస్ నాయకులు,శ్రేణులు,తరలిరావాలని మణుగూరు టిబిజికేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి. ప్రభాకరరావు పిలుపునిచ్చారు.5 తేదీన మధ్యాహ్నం 2గంటలకు జూలూరుపాడు మండలం,వినోభా నగర్ దగ్గర స్వాగతం పలికిన అనంతరం, అక్కడ నుంచి కొత్తగూడెం, ఏరియా వరకు టిఆర్ఎస్ చిహ్నమైన కారు ర్యాలీ ఉత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఆ అనందోత్సవ కారు ర్యాలీ నందు ఏరియా సింగరేణి గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని,స్వాగత కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Post A Comment: