మన్యం మనుగడ, వాజేడు: ఫిబ్రవరి 4.
వాజేడు మండలం గుమ్మడి దొడ్డి గ్రామ పంచాయతీ పరిధిలో దళితులకు డప్పులు పంపిణీ కార్యక్రమాన్ని టిఆర్ఎస్ పార్టీ నూగురు వెంకటాపురం మార్కెట్ కమిటీ చైర్మన్, బొదెబోయిన.బుచ్చయ్య చేశారు. కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు,దళిత అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అనంతరం గుమ్మడి దొడ్డి గ్రామపంచాయతీ యువకులకు వాలీబాల్ కిట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి దొడ్డి గ్రామపంచాయతీ సర్పంచ్. పాయo విజయలక్ష్మి, వాజేడు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి చిన్న మల్లయ్య శిలా ఫోరం అధ్యక్షులు రమణ రావు నర్సిం మూర్తి వేణుగోపాల్. గ్రామపంచాయతీ ప్రజలు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: