మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కేంద్రంలోని జాకారం గ్రామపంచాయతీ పరిధిలో గట్టమ్మ అమ్మ వారిని బుధ వారం ములుగు జిల్లా పరిషత్తు చైర్మన్ కుసుమ జగదీష్ దర్శించుకున్నారు.
జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ గట్టమ్మ ఆలయ ప్రాంగణంను పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.
మేడారం జాతరకు వచ్చే భక్తులు మొదటగా గట్టమ్మ తల్లికి మొక్కలు అప్పజెప్పి మేడారం బయలుదేరి వెళ్లడం ఆనవాయితీ.కనుక జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలని ఆర్డీవో రామదేవి,ఎమ్మర్వో సత్యనారాయణ స్వామి కి సూచనలు చేశారు.పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా జరిపిం చాలని,కరోన నేపథ్యంలో భక్తులందరూ మాస్కులు ధరించేలా చూడాలని అన్నారు.
మాస్కలు లేని భక్తులను, అమ్మవారి దర్శనానికి అనుమ తించవద్దని అన్నారు.భక్తులు ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలను పడవేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.వీరి వెంట టీఆర్ఎస్ నాయకులు తాహిర్ పాషా,
కృష్ణ రెడ్డి,టీఆర్ఎస్ వై,
నియోజకవర్గ కన్వీనర్ కొగిల మహేష్,అధికారులు ఉన్నారు.
Post A Comment: