CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సీఎం గిరి వికాస్ పథకం దరఖాస్తుల స్వీకరణ.గడువు చివరి తేదీ లో అస్పష్టత.

Share it:

 



  •  గందరగోళంలో రైతులు
  •  స్పందించని అధికారులు..


మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 21, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గిరి వికాస పథకం ద్వారా ఏజెన్సీ ప్రాంతాలలోని ఐదెకరాల లోపు వ్యవసాయ భూమి ఉండి కరెంటు, బోరు, మోటార్, సౌకర్యం లేని ఎస్టి గిరిజన రైతుల నుండి సీఎం గిరి వికాస్ పథకం కొరకు దరఖాస్తులు కోరగా, 19 వ తారీకు శనివారం ప్రకటన ఇచ్చి 21వ తారీకు సోమవారం చివరి తేదీ అని ప్రకటించడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తుతోపాటు లబ్ధిదారుల కులం, ఆదాయం సర్టిఫికెట్లను జతపరచమని కోరడం వలన అర్హులైన చాలామంది గిరిజన రైతులకు కుల, ఆదాయం సర్టిఫికెట్లు తక్కువ సమయంలో అందక మధ్యలో ఆదివారం సెలవు ఉండడంతో సర్టిఫికెట్లు సకాలంలో అందక ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా మిగతా మండలాలలో 24 వ తారీకు వరకు గడువు ఉందని ప్రకటనలు వస్తుండడంతో అట్టి విషయాన్ని జూలూరుపాడు మండల అధికారులను అడుగగా ఏ అధికారి స్పందించక పోవడం గమనార్హం. పైగా 21 సాయంత్రం ఐదు గంటల లోపే అని రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయంపై పై అధికారులు తక్షణమే స్పందించి సీఎం గిరి వికాస్ పథకం దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ స్పష్టంగా తెలియజేయవలసిందిగా జూలూరుపాడు ప్రాంత చిన్న సన్నకారు గిరిజన రైతులు కోరుతున్నారు.

Share it:

TS

Post A Comment: