మన్యం టీవీ మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత,ఉద్యమ నేత,సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు, ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు జిల్లా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.60 ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసి,సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తూ,దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు ఒక సంబరంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకుందామని కార్యకర్తలకు తెలియజేశారు. మూడు రోజుల పాటు పార్టీ శ్రేణులు చేయవలసిన కార్యక్రమాల వివరాలు విప్ రేగా తెలుపుతూ,ఫిబ్రవరి 15న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అన్ని మండల కేంద్రాల పరిధిలో ఉన్న ఆసుపత్రులు,వృద్ధాశ్రమాలు, అనాధ ఆశ్రమాలు,వంటి చోట్ల అన్నదానం కార్యక్రమం,పండ్ల పంపిణీ,దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాలి అని తెలిపారు.16వ తేదీన రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని 17వ తేదీ న సీఎం కేసీఆర్, జన్మదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా,మండలాలలో,సర్వమత ప్రార్థనలు,మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన తెలిపారు. ఈ మూడు రోజుల పాటు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా చేపట్టే కార్యక్రమాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని అన్ని మండల కేంద్రాల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,యువకులు,పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Post A Comment: