మన్యం టీవీ న్యూస్ ,దమ్మపేట ఫిబ్రవరి ( 14 ) సోమవారం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గుండుగులపల్లి మాజీ మంత్రి వర్యులు ,టీఆరెస్ రాష్ట్ర నేత తుమ్మల నాగేశ్వరరావు స్వగృహంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తుమ్మల పినపాక ఎమ్మెల్యే, విప్ రేగా కాంతారావు, కోరం కనకయ్య, మెచ్చా నాగేశ్వర్ రావు లను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ఫెడ్ రైతు సంఘం అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్, దమ్మపేట మండల జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,టీఆరెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వర్రావు ,టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారె ఆదినారాయణ, కొయ్యల అచ్యుతరావు , కాసాని బ్రదర్స్ , రాయల నాగేశ్వరరావు, బొల్లికొండ ప్రభాకర్ , బోయినపల్లి సుధాకర్ , మోరంపూడి అప్పారావు,టీఆరెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు రేగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: