మన్యం మనుగడ, టేకులపల్లి:
మండలంలోని సులానగర్ గ్రామానికి చెందిన కుంజా సర్వేష్ (35)మోటార్ సైకిల్ పై వెళ్తూ అదుపుతప్పి పడిపోవడంతో తలకు బలమైన గాయా లై మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం శుక్రవారం ఉదయం తన మోటార్ సైకిల్ పై పాల్వంచ మండలం మల్లారం గ్రామంలో తన సోదరుని వద్దకు వెళ్లి అదే రోజు సాయంత్రం తిరిగి వస్తుండగా మొండి కట్ట సమీపంలో బండి అదుపుతప్పి పడిపోవడంతో తలకు బలమైన గాయాలయ్యాయి కొత్తగూడెం వైద్యశాలకు తరలించగ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందారు. మృతునికి భార్య కుమారుడు ఉన్నారు.
Post A Comment: