CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని.రామచంద్రయ్య ను సత్కరించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.

Share it:

 



మన్యం టీవీ వెబ్ డెస్క్:


పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలువాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారులు సకిని. రామచంద్రయ్య ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఘనంగా సత్కరించారు.పద్మ శ్రీ పురస్కారం వరించిన సందర్భంగా మంగళవారం ఆయన ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ శాలువాతో ఆయనను ఘనంగా సత్కరించారు. అంతరించిపోతున్న ఆదివాసీ సాంస్కృతక కళను బతికిస్తున్నందుకు సీఎం ప్రత్యేకంగా అభినందించారు. తన జీవితకాలపు ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు ను పొందడం పట్ల సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రామచంద్రయ్య యోగ క్షేమాలను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.ఆయనకు భారీ నజరానా ప్రకటించిన సిఎం కేసీఆర్.సకిని రామచంద్రయ్యకు తన స్థానిక జిల్లా కేంద్రం కొత్తగూడెం లో నివాసయోగ్యమైన ఇంటిస్థలం, నిర్మాణ ఖర్చుకు రూ.1 కోటి రూపాయల రివార్డును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.రామ చంద్రయ్య ఇంటి నిర్మాణం,ఏర్పాట్లను సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్,మహమూద్ అలి,మర్రి మల్లారెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్,పువ్వాడ అజయ్ కుమార్,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి,తక్కెళ్ల పల్లి రవీందర్ రావు,తాతామధు, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, మెతుకు ఆనంద్, గణేశ్ బిగాల తదితరులున్నారు.

Share it:

TS

Post A Comment: