మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 04 ) శుక్రవారం ;- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ఆర్లపెంట గ్రామ పంచాయతీ పరిధిలోని అవాస గ్రామాలు అయిన కోడిసగట్టు ఆర్లపెంట గ్రామ పంచాయతీలోని సీతారాం ప్రోజెక్టు పంట కాలువలో భూములను రైతులు కోల్పోతున్నారు గతంలో ప్రజల పంట పొలాల గుండా ఇందిర సాగర్ కాలువ వేయడం కోసం ప్రజల పంట భూములను అదికారులు తిసుకుని ఏరియాల్ సర్వ్ నిర్వహించారు భూముల గురించి దానికి నష్టం పరిహారం ప్రకటించివున్నారు కానీ ఆ మొతం ప్రజలకు ఇవ్వలేదు ఆ పంట కాలువ కూడా ఏర్పాటు చేయలేదు ప్రస్తుతం తిరిగి అవే భూమల మీద సీతారాం ప్రోజెక్టు పంట కాలువ ఏర్పాటు చేయుటకు అధికారులు సర్వే నిర్వహించి భూమిని కోల్పోతున్న వారికి నష్ట పరిహారం ఇచ్చుట కొరకు లబ్దిదారులను గుర్తించారు. కానీ దాని కోసం ఇవ్వవలసిన నష్టపరిహారం మేము ఎప్పుడో చెల్లించివేశము అని భూములను వదిలి వేయాలి అని కాలువ అధికారులు అంటున్నారు.గ్రామ ప్రజలు తమ భూములను తిరిగి సర్వ్ నిర్వహించి లబ్దిదారులను గుర్తించి వారికి తగిన నష్ట పరిహారం ఇప్పించగలరని అధికారులను వేడుకుంటున్నారు ఈ రోజు రైతుల భూములలో తవ్వకాలు జరగకుండా గ్రాంపంచాయితి లోని యువ నాయకులు అడ్డుకున్నారు వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వంక బాబురావు C.P.M పార్టీ నాయకులు సున్నం ననారావు తొలెం శ్రీను ఆదివాసీ యువ నాయకులు కట్టం ప్రసాద్ యువ నాయకురాలు కాకా నాగమణి మరియు గగ్రామంలోని రైతులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: