దమ్మపేట మండలం మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 02 ) బుధవారం ;- మండల కేంద్రంలో ఈరోజు ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం అత్యవసర సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ములుగు జిల్లాలోని గట్టమ్మ తల్లి దేవాలయంలో నాయకపోడు ఆలయ పూజారుల పై గిరిజనేతరులు దాడిచేయటం అవమానించడం అగ్ర కుల దాష్టీకమయిన చర్య అని దీనిపై పోలీసులు విచారణ జరిపించి వెంటనే గిరిజనేతరులపై ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆదివాసీ నాయకపోడు పూజారులకు రక్షణ కల్పించాలని లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఆదివాసీ నాయకపోడు జిల్లా నాయకులు కాసిని వెంకటేశ్వరరావు మండల నాయకులు వాస౦ పోలయ్య కాసిని శ్రీను కాసిని చిన వెంకటేశ్వర్రావు కాసిని చంద్రం అర్జున్ నాగరాజు కొర్రాజులు మరియు సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మొదలగు వారు పాల్గొన్నారు
Post A Comment: