మన్యం మనుగడ మంగపేట.
మండల పరిధిలోని రాజుపేట లో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా బీఎస్పీ పార్టీ మంగపేట మండల కన్వినర్ గుంటపూడి తిరుమల మాట్లాడుతూ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారాలకు మాత్రమే ఆరాధ్య దైవం కాదు భారత జాతికి ముఖ్యంగా బహుజనులందరికి ఆరాధ్యుడే.ఆనాడు సమాజం లో నెలకొని ఉన్న మూఢ నమ్మకాలు, జంతు బలి, వివక్షత లను తొలగించేందుకు ప్రయత్నించాడు. బంజారా జాతిని సన్మార్గంలో నడిపించాడు. బ్రిటిష్ పాలకులు, ముస్లిం పాలకులు హయాంలో బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురైంది. తర తరాలుగా జాతి వివక్షత కు గురవుతూ ఆర్ధిక, సామజిక,అభివృద్ధిలో వెనుక బడిన వారికి దిశ నిర్దేశం చేసి ఆదర్శ ప్రాయుడు అయ్యాడు.హైందవ ధర్మం సంస్కృతి ని కాపాడి మన అందరికి ఆదర్శం అయ్యాడని అటువంటి మహాపురుషులను ప్రతి ఒక్కరూ స్మరించు కోవాలని తెలియజేశారు.
Post A Comment: