మన్యం మనుగడ, టేకులపల్లి:
గత నెల రోజులుగా కర్ణాటక రాష్ట్రం విద్యా సంస్థలలో టీనేజ్ విద్యార్థుల మెదళ్ళలో మత కాషాయీకరణ ను జోప్పిస్తూ హిజాబ్ ధరించిన విద్యార్థినిలపై దాడులకు పాల్పడే విధంగా రెచ్చగొట్టే ఆర్ఎస్ఎస్ మత చాందస వాదాన్ని కి వ్యతిరేకంగా పోరాడాలని పిడీ ఎస్ యూ -పి ఓ డబ్ల్యూ-పి వై ఎల్ -ఇఫ్టూ-ఏ ఐ కే ఎమ్మెస్, అరుణోదయ ప్రజాసంఘాల నేతలు పిలుపునిచ్చారు ఈరోజు పిడిఎస్యు పీవోడబ్ల్యూ రాష్ట్ర ఎంపీల పిలుపులో భాగంగా టేకులపల్లి మండల కేంద్రంలో ఆర్ఎస్ఎస్ బిజెపి మతోన్మాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.
కర్ణాటక రాష్ట్రంలో ఉడిపి కేంద్రంగా హిందూ ముస్లిముల మధ్య జరుగుతున్న మతకలహాలు హత్యాకాండ లను సృష్టిస్తున్న మెజారిటీ హింధూ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ప్రగతిశీల వాదులు తిరుగుబాటుకు సిద్ధం కావాలని వారు అన్నారు. అనాదిగా హిజాబ్ ధరించిన విద్యార్థులను కళాశాలలకు రావద్దని ఆదేశాలు జారీ చేస్తూ పోటీగా కాషాయీకరణ దుస్తులను విద్యార్థులకు పంచిపెడుతూ మతకల్లోలాలు సృష్టించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా బీజేపీ కి ఎదురవుతున్న వ్యతిరేకతను కప్పిపుచుకోవడం కోసం నేడు కర్ణాటకలో ప్రారంభమైన మత కలహాలు అని జరగబోయే ఎన్నికలలో అధికారం చేజిక్కించుకోవడానికి కోసమే అమాయక టీనేజి విద్యార్థులను మతం పేరుతో రెచ్చగొట్టి వారి జీవితాలతో చెలగాటమాడుతోందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నేతలు ధర్మపురి వీర బ్రహ్మ చారి,డి ప్రసాద్,అజ్మీర బిచ్చ, జర్పుల సుందర్,కాంపాటి పృధ్వీ, యదళ్ళపల్లి సావిత్రి దేవా తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: