గుండాల/ ఆళ్లపల్లి ఫిబ్రవరి 15 (మన్యం మనుగడ) టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు సమక్షంలో పార్టీలో చేరిన పలు కుటుంబాలు.మండలం పరిధిలోని మర్కోడు ఎస్సీ కాలనీకి చెందిన కాంగ్రెస్, సిపిఐ పార్టీ కి చెందిన50 కుటుంబాలు కీసరి నరేష్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వీరికి టిఆర్ఎస్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రేగ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి రాష్ట్రంలో అదే మాదిరి నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో పార్టీలో చేరుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు
Post A Comment: