చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: కుల వివక్ష పోరాట సమితి పార్టీ కార్యాలయంలో (కెవిపిఎస్) మండల అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షతన కెవిపిఎస్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శిలు నందిపాటి రమేష్, రాయి రాజా లు పాల్గొని, వారు మాట్లాడుతూ... దళిత బంధు అర్హులైన ప్రతి దళిత పేదవారికి ఇవ్వాలని, దళిత బంధు పథకానికి రాజకీయ జోక్యం ఉండకూడదని, ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేల జోక్యం ఉండకూడదని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ పథకాన్ని కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల కార్యదర్శి మిర్యాల మోహన్ రావు, మండల నాయకులు రాజు, వినోద్, అశోక్, పవన్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: