కూటికి పేదోళ్ళం అయినా, సాటి మనిషి కష్టాల్లో వున్నప్పుడు స్పందించడం లో మేము గొప్పోళ్ళం అని నిరూపించారు రాజు పేట కాలనీ కి చెందిన ఐద్వా మహిళలు, వివరాల్లోకి వెళితే గత 28వ తేదీన భద్రాచలం రాజుపేట కాలనీకి చెందిన చంద్రుగొండ నాగరాజు అరుణ దంపతుల పెద్దకుమారుడు హర్షవర్ధన్ ఊపిరితిత్తులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధితో మొదట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొంది తదుపరి మెరుగైన చికిత్స కోసం జేడీ పౌండేషన్ వారి సహకారంతో భద్రాచలంలో నికిత హాస్పిటల్ లో జాయిన్ చేయించగా అత్యవసరం మేరకు 7 వేల రూపాయలు అత్యవసర మెడిసిన్స్ అందించడం జరిగింది, ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలియ పరచగా భద్రాచలం పట్టణంలోని మానవతా మూర్తులు ,కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే ఈ కుటుంబానికి సహాయం అందించారు. ఈ విషయాన్ని రాజపేట కాలనీకి చెందిన గొల్లమండల శ్రీమతి పుష్పలత మరియుఐద్వా మహిళలు శ్రీమతి హైమావతి, శ్రీమతి సరోజా, మరికొంత మంది మహిళలు కలిసి సుమారు 11 వేల 600 రూపాయల విరాళాలు సేకరించారు, ఈ మొత్తాన్ని ఈ రోజు జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలుడు కుటుంబ సభ్యులకు అందరికి అందజేయడం జరిగింది. అత్యవసర సమయంలో తమ కుటుంబాన్ని ఆదుకున్న జేడీ ఫౌండేషన్,భాద్యుడు శ్రీ మురళీ మోహన్ కుమార్ కి, ఫౌండేషన్ సభ్యు లకు మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలకు ఇతర మానవతా మూర్తులకు శ్రీమతి అరుణ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యుడుశ్రీ క డా లి నాగరాజు తో పాటు,ఐద్వా మహిళలు శ్రీమతి గొల్లమండల పుష్పాలత, చల్ల హైమావతి,గొల్లమండల భవాని,సౌమిత్రి భవాని,శ్రీమతి సరోజ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: