చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: ప్రజల భాగస్వామ్యంతోనే మాదకద్రవ్యాలను అదుపు చేయవచ్చని కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వరబాబు అన్నారు.మంగళవారం స్థానిక లక్ష్యా గార్డెన్స్ నందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, జూలూరుపాడు మండలాలకు చెందిన సర్పంచులకు మాదకద్రవ్యాల అదుపు అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గ్రామాలలో ఉన్న మాదకద్రవ్యాల వినియోగన్ని కూకటివేళ్లతో పీకేవేయాలంటే సర్పంచుల పాత్ర ముఖ్యమైనదన్నారు. యువత పక్కదారి పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. పోడుభూముల్లో, పట్టాభూములలో గంజాయి సాగు చేస్తే పట్టాలను రద్దు చేయడం, రైతుబంధు పథకాన్ని నిలిపివేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో గుట్కా, గంజాయి, జూదం, కోడి పందెలు నిర్వహిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. నేర ప్రవృత్తిని సమాజం నుండి తగ్గించాలంటే పోలీసులతో సమన్వయంగా పనిచేయాలన్నారు. అనంతరం సర్పంచులు పోలీస్ అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సిఐ నాగరాజు, ఎస్సైలు రాజేష్ కుమార్, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: