మన్యం మనుగడ , పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన పడాల వీర్రాజు (75) ఇటీవల అనారోగ్యంతో మరణించడంతోతెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పడాల వీర్రాజు నివాసానికి వెళ్లి మృతుడి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి,ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి వర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య,వీర్రాజు కుటుంబ సభ్యులు, ఇతర టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Post A Comment: