మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండలంలోని బోర్ నరసాపురం గ్రామంలో గల శ్రీ సీతారామ చంద్రస్వామి
ఆలయ17 వ వార్షిక వేద అధ్యయన ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం లో మాఘ శుద్ధ సప్తమి మంగళవారం నుండి మాఘ శుద్ధ ఏకాదశి శుక్రవారం వరకు నాలుగు రోజులపాటుఅధ్యయనోత్సవాలు చాలా వైభవంగా జరిగాయి. అందులో భాగంగా మొదటిరోజు వేదాధ్యయన పారాయణం, సుదర్శన నరసింహ హోమం,సంక్షేప రామాయణం, హోమము ఇత్యాది హోమాలు కూడా నిర్వహించ బడ్డాయి. గురువారం రోజు స్వామివారికి ప్రత్యేకమైన టువంటి అభిషేక,నీరాజనం కార్యక్రమం కూడా వైభవంగానిర్వహించబడింది. శుక్రవారం చివరి ఘట్టం అయినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. వేద పారాయణం క్రతువుల్లో వేద పండితులు శ్రీ పరాశరన్ వెంకటరత్నం ఆచార్యులు, పరాంకుశం కృష్ణమాచార్యులు, పరంకుశం హరి కృష్ణమాచార్యులు,
జీడి కంటి కృష్ణ ప్రసాద్ ఆచార్యులు,జీడికంటిరంగాచార్యులు,స్థానిక ఆలయ అర్చకులు జీడికంటి మధుసూదన్ ఆచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు గౌరవ అధ్యక్షులు కొల్లి దేవకీ, అధ్యక్షులు నర్రా.శ్రీధర్, కడియాల సుదర్శన్ నాయుడు, పూసాల సరోజినీ,వడ్లకొండ చినబాబు,మన్నెం నాగేశ్వర్ రావు,కున్నంకోటిరెడ్డి,గుజ్జుల కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.అశేష భక్త జనుల మధ్య ఈ కార్యక్రమంవిజయవంతంగా ముగిసింది.
Post A Comment: