మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లో తెలంగాణ రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం బోధన మరియు పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన మరియు పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7289 కోట్లతో *మన ఊరు మన బడి* ప్రణాళికతో ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని,సీఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తూ,మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాల లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు మరియు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు,మండల అధ్యక్షులు ముత్యంబాబు ఆధ్వర్యంలో పాఠశాలల పున ప్రారంభం నేపద్యంలో,బెలూన్స్ ను ఎగరవేసి,విద్యార్థులకు ఘన స్వాగతం పలికిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ముత్యం బాబు మాట్లాడుతూ,బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలలో,వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం బోధన చేయాలని గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,కార్యదర్శి రామి రెడ్డి,యువజన అధ్యక్షులు హర్ష నాయుడు,టిఆర్ఎస్ పార్టీ మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు,డీసీసిబి డైరెక్టర్లు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,యువజన నాయకులు, సోషల్ మీడియా సభ్యులు, టిఆరేస్వి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: