మన్యం మనుగడ ఏటూరు నాగారం
మావోయిస్టు దళ సభ్యుడు
మడావి హిడ్మా బుధ వారం ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ముందు లొంగిపోయాడు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.చతిస్గడ్ రాష్ట్రం కిష్టారం మండలం తొండ మార్క గ్రామానికి చెందిన మాడవి హిడ్మా @ముక్క మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక స్వచ్ఛందంగా లొంగిపోయాడని అన్నారు. లొంగిపోయిన దళ సభ్యుడు నుండి ఆయుధాలు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.మావోయిస్టు దళ సభ్యులు అయినా మిలీషియా సభ్యులు అయినా జనజీవన స్రవంతిలో కి రావాలనుకుంటే వారి కుటుంబ సభ్యులతో నైనా ఊరి గ్రామ పెద్దలు తో నైనా పోలీసు వారిని సంప్రదించి స్వచ్ఛందంగా లొంగి పోవచ్చునని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఓఎస్డి శోభన్ కుమార్,ఏటూరు నాగారం ఏఎస్పి అశోక్ కుమార్,సీఆర్పీఎఫ్ కమాండెంట్ అమిత్ కుమార్, ఏటూరు నాగారం సీఐ కిరణ్ కుమార్,ఏటూరు నాగారం ఎస్సై రమేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: