తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలతో పెట్టుకుంటే ఢిల్లీ కోటలు బద్దలు అవుతాయని హెచ్చరించారు. జనగామ యశ్వంత్‌పూర్‌లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
‘‘ప్రజల మద్దతు ఉంటే ఢిల్లీ కోట బద్దలు కొడతాం. మోడీ… జాగ్రత్త.. నీ ఉడుత బెదిరింపులకు భయపడం. బిజెపి బిడ్డాలారా…. మా టీఆర్ఎస్ క్యాడర్ ను ముట్టుకుంటే నశం చేస్తం. యుద్దం చేసి గెలిచిన పార్టీ. బలిదానాలు చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్న పార్టీ మాది.
అద్భుత ప్రగతితో పోతున్న తెలంగాణను ఆశీర్వదించండి. సిద్దిపేట జనం పంపితే తెలంగాణ తెచ్చుకున్నం… ఇవాళ తెలంగాణ జనం ఆశీర్వదిస్తే దేశాన్ని ఒక్కటి చేస్తా. ఖబడ్దార్ మోడీ. మమల్నీ ముట్టుకుంటే అడ్రస్ లేకుండా చేస్తాం.
ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యలే. మెడికల్ కాలేజీ ఇయ్యలే. నువ్వు ఇవ్వకున్నా మంచిదే. ఈ దేశం నుంచి నిన్ను తరిమేసి.. ఇచ్చేటోన్ని తీసుకొచ్చుకుంటాం.
తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరి కళ్లు మంటపెడుతున్నాయి. ప్రజల శక్తితోనే తెలంగాణను సాధించుకున్నాం. అద్భుతమైన పంటలను పండించుకున్నాం. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉన్నాం.’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
Post A Comment: