CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సింగరేణి ప్రాంతీయ వైద్యశాలలో పొరుగు సేవల వైద్య సిబ్బందిని కొనసాగించాలి.ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ఎస్ ఓటూ జీఎం లలిత్ కుమార్ కు వినతిపత్రం అందజేత.

Share it:

 


                         

మన్యం టీవీ మణుగూరు:


సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ప్రాంతీయ వైద్యశాల లో పొరుగు సేవల నర్సులను వంట సిబ్బందిని,ఎక్స్ రే, సిబ్బంది ని కొనసాగించాలని కోరుతూ,మంగళవారం నాడు ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో పొరుగు సేవల సిబ్బంది ఏరియా ఎస్ ఓటూ జీఎం డి. లలిత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు ఏరియా అధ్యక్షులు ఏ.మంగీలాల్ మాట్లాడుతూ,ఏరియా హాస్పిటల్ లో పొరుగు సేవల నర్సులుగా,నాలుగు మస్టర్ లకు గాను ఐదుగురు పని చేస్తున్నారనీ,మరియు వంట సిబ్బంది సహాయకులుగా ఇద్దరు పని చేస్తున్నారనీ ఎక్స్-రే ల్యాబ్ టెక్నీషియన్ గా ఒకరు పనిచేస్తున్నారని,టెండర్ కాలం ముగిసిందని ఐదుగురిని వంట సహాయకులుగా ఇద్దరు అవసరం లేదు ఒకరు చాలు అని,ఒకరిని రేపటి నుండి విధులకు రావద్దని సింగరేణి ప్రాంతీయ వైద్యశాల యాజమాన్యం మౌఖిక ఆదేశాలు జారీ చేశారని అన్నారు.ఎక్స్- రే టెక్నీషియన్ని కూడా వద్దన్నారని,నిరుద్యోగ సమస్య ఒకవైపు,ఆర్థిక ఇబ్బందులు మరొకవైపు.ఈ నేపథ్యంలో కష్టమైన ధైర్యం చేసి కరోనా పేషెంట్ లకు సేవలు చేసేందుకు ముందుకు వచ్చినటువంటి వారిని, ఇప్పటివరకు వారి సేవలను ఉపయోగించుకుని, మణుగూరులో రోజు రోజుకి కోవిడ్- 19 విస్తరిస్తున్న నేపథ్యంలో,ఈ పయనం ఎటువైపో తెలియని సందిగ్ధ సమయంలో ఆకస్మికంగా వీరిని పని నుండి తొలగించటం సరికాదని అన్నారు.ఉపాధి లేక వీరు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉందని,యాజమాన్యం ఆలోచించి వీరిని తిరిగి కొనసాగే విధంగా సానుకూలం గా స్పందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పొరుగు సేవల వైద్య సిబ్బంది రాము,స్టెల్లా, స్రవంతి,నిరోష తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: