మన్యం మనుగడ, అశ్వారావుపేట:
హైదరాబాద్ పి వి నరసింహారావు పశువైద్య విశ్వ విద్యాలయం లో జరిగిన నూట్రిషియన్ ఇంటివెన్షన్ యాక్షన్ ప్లాన్ ఇన్ పి టి జి కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళశై సౌందర్య రాజన్ శనివారం పాల్గొని భద్రాద్రి అశ్వారావుపేట మండల పరిధిలోని గోగులపూడి , పూసుకుంట గ్రామా కొండరెడ్లకు రాజశ్రీ కోళ్ళని పంపిణి చేసారు. అనంతరం వివిద సమస్యలతో కూడిన వినతిపత్రం ఇవ్వటం జరిగింది . ఈ కార్యక్రమంలో ఆదివాసీ కొండరెడ్ల సంఘం వ్యవస్తాపక గౌరవ అద్యక్షులు ముర్ల రమేష్ ,భద్రాద్రి కొత్తగుడెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు యోగి సూర్యనారాయణ , గురుగుంట్ల బాబురెడ్డి , గోగుల మంగిరెడ్డి , ఉమ్మల నాగరాజు రెడ్డి , యాట్ల రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు .
Post A Comment: