ప్రభుత్వ రంగ సంస్థలలో కార్మికుల చట్టాలను కాల రాయాలని చూస్తున్న యజమాన్యలకు వెన్నులో వణుకు పుట్టేలా కార్మికుల పక్షాన పోరాడుతూ కార్మికుల ఆశాజ్యోతి గా సంగెం జంగయ్య ఓ వెలుగు వెలగాడాని 1104 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిద్దెల హుస్సేన్ అధ్యక్షతన జరిగిన బిటిపిఎస్ లో జంగయ్య సంతాప సభ లో బిటిపిఎస్ సి ఈ బాలరాజు అన్నారు.అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జంగయ్య కు నివాళులర్పించారు.అనంతరం సభను ఉద్దేశించి సి ఈ బాలరాజు మాట్లాడుతూ మచ్చ లేని మనిషిలా కార్మికుల పక్షాన రాజీ లేని పోరాటాలు చేశారని అనేక మంది కార్మికుల సమస్యలపై పోరాడి వారికి మార్గదర్శిగా నిలిచిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారని, ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు.ఈ కార్యక్రమంలో జెన్కో శాఖ అధికారులు బిటిపిఎస్ యూనియన్ నాయకులు,తెలంగాణ రాష్ట్ర ఏస్సి,ఎస్టీ ఎంప్లాయిస్ వెల్పేర్ అసోషియేషన్ సెంట్రల్ కమిటీ నాయకులు సిద్దెల హుస్సేన్.ఎస్ సి ఎ డి యం శ్రీనివాస్, డి ఈ టెక్నికల్ దివాకర్ , అంబేద్కర్ డిఈ రామకృష్ణ,చందు ఏఈ,లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు హెమ్లా నాయక్ సత్యనారాయణ 327 నాయకులు, ప్రేమ్, trvks నాయకులు సాధిక్ పాషా ప్రకాష్, టి ఎన్ వి కే ఎస్ నాయకులు కాపా నాగేశ్వరరావు, h 142 నాయకులు మోహన్ నాయకి మహిళా కార్మికులు ఏడి ఎం సిబ్బంది, ఇంజనీర్ లు పాల్గొన్నారు
Post A Comment: