చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: బంగారు తెలంగాణ కోసం నిరంతరం పని చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారా బాబు అన్నారు. మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని టిఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టిఆర్ఎస్ పరిపాలనలో కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు లంకా విజయలక్ష్మి, భూక్య రాజి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మేడా మోహన్ రావు, గాదె శివ ప్రసాద్, చీదేళ్ళ పవన్ కుమార్, శీలం సీతారామిరెడ్డి, చాపలమడుగు రామరాజు, వంకాయలపాటి బాబురావు, కల్లం వెంకటేశ్వర్లు, నడిపి కిట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: