చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: టిఆర్ఎస్ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు.శుక్రవారం మండల పర్యటనలో భాగంగా రేపల్లెవాడ టిఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ను శాలువాతో ఘనంగా సన్మానించారు. పలు సమస్యలను కార్యకర్తలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆయన స్పందించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలులో టిఆర్ఎస్ కార్యకర్తల పాత్ర ఎనలేనిదన్నారు. అనంతరం టేకులబంజర గ్రామంలో జరిగిన వివాహ వేడుకలలో ఆయన పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భానోత్ పార్వతి, సర్పంచులు బానోత్ కుమారి, పుసం వెంకటేశ్వర్లు, కాకా శీను, దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మేడ మోహన్ రావు,దొడ్డకుల రాజేశ్వరరావు, ఉప్పతల ఏడుకొండలు, గాదె శివప్రసాద్, మద్దిరాల చిన్న పిచ్చయ్య, సూర వెంకటేశ్వర్లు, వంకాయలపాటి బాబురావు, ఉన్నం నాగరాజు, గుగులోత్ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: