- ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం నిర్ణయం పై సీఎం కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు
మన్యం టీవీ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాలమేరకు మండల పరిధిలోని జిల్లాపరిషత్ ఆశ్రమ పాఠశాల ప్రభుత్వ, మండల పరిషత్ పాఠశాలలో వచ్చే విద్యా ఈ సంవత్సరం నుండి ఇ ఇంగ్లీష్ మీడియం బోధన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఆనందోత్సవాల మధ్య విద్యార్థులతో కలిసి ఈ సందర్భంగా ఎంపీపీ రేగా కాళికా, జెడ్ పి టి సి కొమరం కాంతారావు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గ్రామ పంచాయతీల సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు గులాబీలు ఎగరవేసి విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీపీ రేగా కాళిక, జడ్పిటిసి కొమరం కాంతారావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ డెవలప్మెంట్ కోసం 7.889 కోట్ల రూపాయలు ప్రశ్నించే స్కూల్లో ఉన్న మరమ్మతులు మౌలిక సదుపాయాల కోసం మంజూరు చేయడం చాలా సంతోషమని అలాగే ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా సర్కారు పాఠశాలల్లో ఇంగ్లీషు బోధన తీసుకురావడం చాలా సంతోషమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన ప్రతిపాదించిన సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు ఎలిపెద్ది శైలజ ఎల్లబోయిన మునీంద్ర సర్పంచులు పాయం నరసింహారావు ఇర్ప. విజయ్ కుమార్ బత్తిని. నరసింహారావు, జవాజి రాధా పోలెబోయిన నరసింహారావు, పోలెబోయిన. పాపక్క కొమర విశ్వనాథం టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Post A Comment: