మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలో స్థానిక రింగ్ రోడ్ సెంటర్ లో గల బాలురు, బాలికల హై స్కూల్ లో నిర్వహించిన చదువు, ఆనందించు, అభివృద్ధి చెందు అనే కార్యక్రమాన్ని అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి. శ్రీరామమూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్ధిని, విద్యార్థులు తప్పకుండా ప్రతి ఒక్క పీరియడ్ లో తప్పనిసరిగా ఒక 10 నిమిషాలు అయినా చదవాలని, చదువును ఇష్టంగా చదవాలని, కరోనా నేపథ్యంలో ఆన్లైన్ క్లాస్ లో సరిగ్గా చదవ లేక విద్యకు కొంత దూరం అయ్యారని కావున ప్రతి ఒక్క విద్యార్థి ఆడుతూ చదువుకొని అభివృద్ది చెంది మంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనీ అయన అయన విద్యార్థులకు సూచన ఇచ్చారు. అలాగే వసంతి పంచమి సందర్భంగా పాఠశాలలో గల సరస్వతి దేవి విగ్రహానికి పూల మాలలు వేశారు. అలాగే మన తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి పేద విద్యార్ధికి మంచి విద్య అందించే విధంగా ప్రభుత్వ పాఠశాలలను అబ్దివృద్ధి చేస్తున్నారని, కావున ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించి, మీ పిల్లలకు మంచి విద్య, క్రమశిక్షణను అందించాలని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటూ విద్యా కమిటీ చైర్మన్ దివ్విలి ప్రసాద్, బాలుర పాటశాల ప్రధానోపాధ్యాయులు రాంబాబు, బాలికల ప్రధానోపాధ్యాయులు అమృతా, పాఠశాల సిబ్బంది మరియు యుఎస్ ప్రకాష్ ప్రభాకర చార్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: