మన్యం మనుగడ కరకగూడెం: కరకగూడెం మండలం ప్రధాన సెంటర్లో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం
మండల టిఆర్ఎస్ పార్టీ తరఫున నిరసనలు వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ రేగా కాలిక మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పాలని చూస్తున్నారని దానిమూలంగా ఉద్యోగులకు శాపంగా మారనుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా స్పందించి ప్రైవేటీకరణ అనే విషయన్ని వెనక్కి తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున భారీ ఆందోళనలు నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు , ఆత్మ కమిటీ డైరెక్టర్ కొంపెల్లి పెద్ద రామలింగం, మండల ఉపాధ్యక్షులు పోగు వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు రేగా సత్యనారాయణ,ఎలిపెద్ది శ్రీనివాస్ రెడ్డి,మహిళా మండల అధ్యక్షులు కాసు లావణ్య, రఘునాధపాలెం సర్పంచ్ పోలెబోయిన నరసింహారావు,బైరి శెట్టి చిరంజీవి,కాటుకజ్వల వేణు సోషల్ మీడియా అధ్యక్షుడు చిట్టి మల్ల ప్రవీణ్ కుమార్,దాసరి సాంబశివరావు,మల్లిపెద్ది సాంబశివరావు, జాడి రవి,నిట్ట సందీప్ ,నిట్ట రమేష్ ,గిద్దె రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: