మన్యం మనుగడ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఏజెన్సీ కరకగూడెం మండలాన్ని ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రూపురేఖలు మర్చుతున్నారని కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళికా తెరాస మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు.
కరకగూడెం మండలంలోని 16 గ్రామ పంచాయతీలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 18 సీ సీ రోడ్లగాను రూ.90 లక్షలు,కొత్తగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో మధ్యగుంపు నుండి కొమరం గుంపు మధ్యలో ఫ్లడ్ డ్యామేజ్ కోసం లోలెవల్ బ్రిడ్జి నిర్మాణ కొరకు 25.29 లక్షల రూపాయలు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే తెరాస జిల్లా రేగా కాంతారావు మంజూరు చేయించినందుకు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రానున్న రోజుల్లో రేగా కరకగూడెం మండలాన్ని మోడల్ మండలంగా తీర్చిదిద్దాన్నారు.
ఈ సమావేశంలో ఏఎంసీ వైస్ ఛైర్మన్ కొమరం రాంబాబు,మండల ప్రధాన కార్యదర్శి బుడగం రాము,ఆత్మ కమిటీ డైరక్టర్ కొంపెల్లి పెద్ద రామలింగం,సొసైటీ డైరక్టర్ రావుల కనకయ్య,యలిపెద్ది శ్రీనువాస రెడ్డి,బైరిశెట్టి చిరంజీవి,రేగా సత్యనారాయణ,సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టిమల్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: