మన్యం టీవీ మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత,ఉద్యమ నేత, ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి వర్యులు కేటీఆర్ పిలుపునిచ్చిన మూడు రోజుల కార్యక్రమాల్లో భాగంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశానుసారం రెండోవ రోజు బూర్గంపహాడ్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ వైద్యశాల నందు రక్తదానం శిబిరం కార్యక్రమం బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, పీఏసీఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బూర్గంపహాడ్ మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,సొసైటీ డైరెక్టర్లు, పార్టీ ముఖ్య నాయకులు,పార్టీ మండల కమిటీ సభ్యులు,పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు,నాయకులు,గ్రామ కమిటీ అధ్యక్షులు,వార్డు సభ్యులు,కార్యకర్తలు,యువజన నాయకులు అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: