మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మారేడు గూడెం వద్ద సుమారు 35 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న వంతెన నిర్మాణం పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పరిశీలించారు. సాధ్యమైనంత తొందరలో వంతెన నిర్మాణం పూర్తి చేయాలని సదరు కాంట్రాక్టర్ కు తెలియజేయడం జరిగింది. బ్రిడ్జి నిర్మాణాన్ని నాణ్యత తో నిర్మించాలని, ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, వాతావరణం పార్టీ అభిమానులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: