మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్ర అధికార టిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా, ఎన్నికై అధ్యక్ష హోదాలో శనివారం రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి జిల్లాకు వస్తున్న సందర్భంగా, జిల్లా సరిహద్దు గ్రామమైన వినోబానగర్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి జిల్లా టిఆర్ఎస్ పార్టీ తొలి అధ్యక్షులు, రేగా కాంతారావు కు స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య మరియు జిల్లా నలుమూలల నుంచి తరిలి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మేళతాళాలతో, పుష్పగుచ్ఛాలతో, శాలువాలతో సన్మానించి, సత్కరించి, ఘన స్వాగతం పలికారు. రేగన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ దిక్కులు మారుమ్రోగే లా నినదించారు. పార్టీ శ్రేణులకు అభిమానులకు రేగా కాంతారావు అభివాదం చేస్తూ భారీ కార్ ర్యాలీ జిల్లా కేంద్రానికి కొనసాగింది. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చౌడం నరసింహారావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: