మన్యం మనుగడ ములుగు
ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప)మండలం ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య అధ్యక్షతన కల్యాణ లక్ష్మీ చెక్కులను ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ 33 మంది లబ్ధిదారులకు 33,03, 828/- (ముప్ఫై మూడు లక్షల మూడు వెయ్యిల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రూపాయల) విలువైన చెక్కులను అంద జేశారు.అనంతరం ములుగు జిల్లా అధ్యక్షులు ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ.గత ప్రభుత్వాలు ఆడపిల్లల కుటుంబాలను పట్టించుకోకుం డా పరిపాలన కొనసాగిందని,
ఉమ్మడి రాష్ట్రంలో ఆడపిల్లల కు న్యాయం జరగలేదని,
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కల్యాణ లక్ష్మీ లాంటి గొప్ప పథకాలను కొనసాగుతున్నా యని అన్నారు.ప్రపంచం వ్యాప్తంగా కరోన వలన ఆర్థిక వ్యవస్థ కుంటు పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు అండగా ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో కల్యాణ లక్ష్మీ పథకం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడ పిల్లల కుటుంబాలకు అండగా నిలబడ్డారని అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల అనువుగా పరిపాలన చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ,ఎంపీటీసీ లు,ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: