- ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు
- కదిలి వచ్చిన జిల్లా ప్రజాప్రతినిధులు.
అన్నపురెడ్డిపల్లి - చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : మండలంలోని అన్నపురెడ్డిపల్లి గ్రామంలో గల శ్రీ అంకమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అన్నదాన సత్రం నీ మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు... అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఎంతో విశిష్టమైన ప్రాంతంగా రాష్ట్రస్థాయిలోనే దైవ క్షేత్రాలు కలిగి ఉన్న ప్రాంతం అని అన్నారు....... ఇంతటి దైవ క్షేత్రాలుగా నానాటికీ అభివృద్ధి చెందటం లో ముఖ్య భూమిక పోషిస్తున్న శ్రీ బ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మార్గాని శ్రీనివాసరావు సేవలు అమోఘమని కొనియాడారు... ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట టిఆర్ఎస్ ఇన్ఛార్జ్ జారై ఆదినారాయణ, మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు, జడ్పిటిసి భారతి లావణ్య,చండ్రుగొండ జడ్పిటిసి కొడకండ్ల వెంకటరెడ్డి, దమ్మపేట జెడ్ పి టి సి పైడివెంకటేశ్వరరావు,ఎంపీటీసీ ఐలూరు కృష్ణారెడ్డి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి టిఆర్ఎస్ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: