CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అరవై ఏండ్లలో జరగని అభివృద్ధి ఎనిమిది ఏళ్లలో చేసిన ఘనత కేసీఆర్ దే - దేశం మొత్తం కేసీఆర్ పథకాల వైపే చూస్తుంది.

Share it:



  •  అభివృద్ధి పథకాల్లో మేమంతా భాగస్వాముల మవుతాము
  • ఘనంగా కేసీఆర్ జన్మదినం వేడుకలు.

ములకలపల్లి:ఫిబ్రవరి17(మన్యం మనుగడ)న్యూస్:

సాయిబాబా గుడి లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు సందర్భంగా ప్రత్యేకంగా పూజా కార్యక్రమం చేశారు.అనంతరం మొక్కలు నాటారు.అనంతరం టీఆర్ ఎస్ కార్య కార్యకర్తలు అందరూ ములకలపల్లి మెయిన్ సెంటర్ లో కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ కి శుభాకాంక్షలు తెలపడం జరిగినది.అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు గారు మాట్లాడుతూ,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకుల చేతుల్లో వివక్షకు గురౌతున్న తెలంగాణను పధ్నాలుగు సంవత్సరాల పాటు విశ్రమించకుండా శ్రమించి ఉద్యమించి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని,కొనియాడారు.సాధించిన తెలంగాణ మరొకరి చేతుల్లోకి వెళితే తాను అనుకున్న లక్ష్యం నెరవేరదని తలచి తానే రథ సారధిగా మారి ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తూ బంగారు తెలంగాణగా మార్చిన మహనీయుడు కెసిఆర్ అని, ప్రత్యేక తెలంగాణ సాధించినా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న మహనీయుడు కేసి ఆర్ అని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ వల్లనే ఇదంతా సాధ్యమైందని,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజా సంక్షేమ పథకాల్లో మేమంతా భాగస్వాములై, ప్రతి క్షణం ప్రజా సంక్షేమం కోరుకునే ముఖ్యమంత్రి కెసిఆర్ పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నట్లు ఆయన మాట్లాడటం జరిగింది.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, ఎంపీపీ మట్ల నాగమణి,,కార్యదర్శి శనగ పాటి అంజి, పువ్వాల మంగపతి , పవర్ పని పార్వతేని అమనాథ్, సొసైటీ డైరెక్టర్ చీకటి ప్రకాష్ , మేకల వెంకన్న, పుష్పాల చందర్రావు,కరుటూరి కృష్ణ , కొండవీటి రాజారావు, కోండ్రు సుందర్ రావు,సర్పంచ్ లు కారం సుధీర్, వాడే నాగరాజు,బయటి రాజేష్ సున్నం సుధాకర్, కేసరి శ్రీను,సున్నం సుశీల, సవలం సుజాత ముస్లిం మైనారిటీ సర్దార్, కుంజావెంకటేష్, తాటి ప్రవీణ్,గుంటూరు కృష్ణ,నాగళ్ళ వెంకటేశ్వర్లు,పర్వతనేని అమర్నాధ్,బిక్కుమల్ల సుధాకర్, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: